
రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ కంపెనీకి ఐటీ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఫాక్స్కాన్ పెట్టుబడి పెట్టడానికి తెలంగాణను ఎంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్ట ప్రజలకు చిరకాలం గుర్తిండిపోయే రోజు అని ఆయన అన్నారు. 9 ఏళ్లుగా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు.
భారత్లో క్రియేట్ అయ్యే ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే క్రియేట్ అవుతోందని తెలిపారు. రాష్ట్రావిర్భావం తరువాత కొత్తగా 23 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టం పురోగాభివృద్ధి సాధిస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఫాక్స్కాన్ ఛైర్మన్ యాంగ్లియూ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఫాక్స్కాన్ గురించి..
ఫాక్స్కాన్(ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్) కంపెనీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్లో రూ.1,656 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. టీఎస్ఐఐసీ కి చెందిన 200 ఎకరాల్లో ఈ కంపెనీ ఏర్పాటుకానుంది. ఈ కంపెనీ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా 35 వేలు, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పించనుంది.