సిటీలో ఎన్ని ఫేమస్ స్కూల్స్ ఉన్నా..ఆ స్కూల్ ప్రత్యేకత వేరు. తక్కువ ఫీజుతో ఛారిటీగా నడిపే ఈ స్కూల్స్ లో అడ్మిషన్ దొరకడం అంత ఈజీ కాదు. నాణ్యమైన విద్యా, విలువల్ని అందించడంలో దేశంలోనే టాప్ రేటింగ్ ఉన్న భారతీయ విధ్యాభవన్ ఎన్నో అరుదైన అవార్డుల్ని అందుకుంది. వ్యవస్ధాపన దినోత్సవం సంధర్భం గా భారతీయ విద్యా భవన్ ఆత్మకూరి రామారావు స్కూల్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
భారతీయ విద్యా భవన్ ఆత్మకూరి రామారావు స్కూల్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ లు ఈస్కూల్లోనే చదివారు.చదువుతో పాటు సంస్క్రుతి, సంప్రాదాలతో నడపడమే స్కూల్ ప్రత్యేకత. లాభాపేక్ష లేకుండా స్కూల్ ని నడపడం,సమాజానికి మంచి విద్యార్దుల్ని అందించడమే ధ్యేయంగా స్కూల్ నిర్వహిస్తున్నారు.
భారతీయ విద్యాభవన్ వ్యవస్థాపకుడు కె.ఎం.మున్షీజీ జయంతి వేడుకలు హైదరాబాద్ భారతీయ విద్య భవన్ లో ఘనంగా జరిగాయి. మొదటగా విద్య భవన్ హైదరా బాద్ కేంద్రం వైస్ చైర్మన్ గోపాల కృష్ణన్ కె.ఎం.మున్షీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భారతీయ సంస్కృతి , సంప్రదాయాలను పరిరక్షించిన మహనీయుడు కె.ఎం.మున్షీ అని గోపాల కృష్ణన్ కొనియాడారు. భారతీయ విద్యాభవన్ సంస్థలు సంస్కృతం, భారతీయ శాస్త్రీయ సంగీతం మొదలుకొని వివిధ అంశాలలో విద్యను అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కె.ఎం.మున్షీ జీవిత సారాంశం పై ప్రదర్శించిన బుర్రకధ ఆకట్టుకుంది.