రిపోర్టర్లమంటూ బెదిరించి వసూళ్లు చేస్తున్న ముఠా అరెస్ట్

రిపోర్టర్లమంటూ బెదిరించి వసూళ్లు చేస్తున్న ముఠా అరెస్ట్
  • నలుగురుని అరెస్ట్ చేసిన పోలీసులు 
  • నిందితుల్లో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు  
  • హనుమకొండ జిల్లాలో ఘటన 

హనుమకొండ, వెలుగు: రిపోర్టర్లమంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు అరెస్టైన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. సుబేదారి సీఐ సత్యనారాయణ రెడ్డి సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. హంటర్ రోడ్డులోని న్యూ శాయంపేటకు చెందిన వంగ సాయికృష్ణ, గుండాల సందీప్, వరంగల్ కాపు వాడకు చెందిన పెద్దూరు మహేశ్, కోడం గణేశ్​ఫ్రెండ్స్. బెంగళూరులో సాయికృష్ణ, సందీప్​సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు కాగా.. ప్రస్తుతం వర్క్​ ఫ్రం హోమ్ లో ఉన్నారు.

వీరు ఆదివారం సాయంత్రం న్యూశాయంపేట శివారులోని రైల్వే ట్రాక్​పక్కన మద్యం తాగుతూ.. అటునుంచి వెళ్తున్న ఓ టిప్పర్​ను ఆపారు. తాము రిపోర్టర్లమని, ఎన్ హెచ్ఆర్ సీ ఆఫీసర్లమంటూ టిప్పర్​డ్రైవర్​ను బెదిరించారు. ఆపై అతని జేబులోంచి రూ.400 తీసుకున్నారు. అంతకుమించి లేవని చెప్పగా డ్రైవర్ ఫోన్​పే ద్వారా 1,500 తమ అకౌంట్​కు ట్రాన్స్​ఫర్​చేయించుకున్నారు. ఆపై టిప్పర్​ఓనర్​నెమరి గొమ్ముల సురేశ్​కు ఫోన్​ చేసి బెదిరించారు. దీంతో సురేశ్​ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నలుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు.