వ్యక్తిని కట్టేసి కొట్టిన నలుగురు అరెస్ట్​

  • మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అతనిపైన కేసు

కుషాయిగూడ, వెలుగు: మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో లో కట్టేసి కొట్టిన నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. చర్లపల్లిలో ఉండే ఓ మహిళ ఇంట్లోకి శుక్రవారం రాత్రి లింగస్వామి అనే వ్యక్తి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె భర్తకు చెప్పడంతో పాటు కుషాయిగూడ పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోలీసులు లింగస్వామిని అదుపులోకి తీసుకొని విచారించి మరుసటి రోజు మళ్లీ రావాలని చెప్పారు. కానీ బాధితురాలి భర్త మరో ముగ్గురితో కలిసి రాంపల్లిలో ఉండే లింగస్వామి ఇంటికి వెళ్లి అతన్ని ఫాస్ట్​ ఫుడ్ సెంటర్ కు తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా చితకబాదారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అంతేకాకుండా ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో లింగస్వామి తల్లి పోలీసులకు కంప్లయింట్ చేయడంతో దాడి చేసిన నలుగురు పృథ్వీ, మనీష్ ఠాకూర్, సిరాజ్, ప్రవీణ్ లపై, లింగస్వామిపై కూడా కేసులు ఫైల్ చేశామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

నిలోఫర్ లో 3 నెలలుగా జీతాల్లేవ్

పెళ్లి వేడుకల్లో మందు వాడకుంటే పదివేలు బహుమతి

ఈ-మోటార్ సైకిల్ ను లాంచ్ చేసిన అటు మొబైల్ సంస్థ

పేద విద్యార్ధికి దాతల అండ.. వీ6, వెలుగు కథనానికి స్పందన