నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. వాళ్ల సుఖం కోసం రక్తం చిందిస్తాడు. కానీ ఈ కసాయి తండ్రి ఏం చేశాడు…? కనికరం లేకుండా కన్నకూతుర్ని కొట్టుకుంటూ రోడ్ల వెంట పరిగెత్తించాడు. అదిచాలదన్నట్లు బహిరంగంగా గుండు కొట్టించాడు.
మధ్య ప్రదేశ్ లో దారుణం జరిగింది. అలీరాజ్‌పూర్ సోండోవా ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక తనకు తెలిసిన ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడడాన్ని ఆమె తల్లిదండ్రులు చూశారు. అంతే బాలిక తండ్రికి కోపం కట్టలు తెచ్చుకుంది. అబ్బాయితో మాట్లాడతావా..? నువ్వెంత..? నీ వయసెంత అంటూ..? చితక బాదాడు. నాన్న నన్ను క్షమించి ఇకపై అబ్బాయితో ఫోన్లో మాట్లాడను. నన్ను కొట్టకండి అంటూ కాళ్లపై పడి వేడుకున్నా కనికరం లేని కుటుంబ సభ్యులు బాలికను కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లి ఓ బహిరంగం ప్రదేశంలో గుండు కొట్టించారు.
అయితే తల్లిదండ్రుల దాష్టింకపై పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం తో వైరల్ అయ్యింది. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లిదండ్రుల దాడితో తీవ్రగాయాలైన బాలికను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు