నేషనల్ హైవే అక్రమాల్లో నలుగురు అరెస్ట్

 

  •     ఇద్దరు ఉద్యోగులు,మరో ఇద్దరు మాజీ సర్పంచ్​లు
  •      ఏకకాలంలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ  

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మించిన 364 నేషనల్ హైవే భూ సేకరణ, నష్టపరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రెండు నెలలుగా విచారణ జరుపుతున్న ఏసీబీ శనివారం నలుగురిని అదుపులోకి తీసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మాజీ సర్పంచులైన శంభుదాస్ ను ఆసిఫాబాద్ లోని ఆయన ఇంట్లో, లక్ష్మీ నారాయణ గౌడ్ ను హైదరాబాద్ లో, వరంగల్ ఆర్డీవోగా పనిచేస్తున్న సిడం దత్తును ఆయన ఆఫీస్ లో, డిప్యూటీ తహసీల్దార్ నాగోరావ్ ను అదిలాబాద్ జిల్లా తోషం గ్రామంలోని బంధువుల ఇంట్లో అదుపులోకి తీసుకున్నట్లు కరీంనగర్​ రేంజ్​ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. నలుగురిని ఏకకాలంలో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విచారణ కొనసాగుతోందన్నారు. హైవే భూ సేకరణలో జరిగిన అక్రమాల ఇష్యూ.. అధికారులు, మాజీ ప్రజాప్రతినిధుల అరెస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.