గంజాయి అమ్ముతున్న నలుగురు అరెస్ట్

హసన్‌‌పర్తి, వెలుగు : గంజాయి అమ్ముతున్న నలుగురిని సోమవారం హనుమకొండ జిల్లా హసన్‌‌పర్తి పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. స్థానిక పెద్ద చెరువు వద్ద సోమవారం పోలీసులు పెట్రోలింగ్‌‌ నిర్వహిస్తున్నారు. ఈ టైంలో కరీంనగర్‌‌ జిల్లా జమ్మికుంట మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన మహ్మద్‌‌ ఖమ్రుద్దీన్‌‌, ఎల్కాపెల్లి అరవింద్‌‌తో పాటు మరో ఇద్దరు మైనర్లు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని పట్టుకొని తనిఖీ చేశారు. వారి వద్ద 2.400 కిలోల గంజాయి దొరకడంతో నలుగురిని స్టేషన్‌‌కు తరలించి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌‌కుమార్‌‌ తెలిపారు.