నకిలీ ధనిలోన్ యాప్​ ముఠా అరెస్టు : ఎస్పీ రావుల గిరిధర్​

వనపర్తి, వెలుగు: నకిలీ ధని లోన్​ యాప్​ ద్వారా డబ్బులను కాజేసిన ముఠాలోని మరో నలుగురు సభ్యులను అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు   ఎస్పీ రావుల గిరిధర్​ తెలిపారు. ఎస్పీ ఆఫీసులో  ఆయన మీడియాతో మాట్లాడారు.  సైబర్​ ముఠాలోని 11 మంది లో ఏడుగురిని ఈ నెల 6న అరెస్టు చేసి, మిగిలిన నలుగురిని శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు.  వీరు బాధితుల నుంచి ధని లోన్​ యాప్​ ద్వారా దాదాపు రూ.4కోట్ల వరకు కాజేశారు.

 జిల్లాలోని నర్సింగాయపల్లి ప్రకాశ్​కుమార్​, వనపర్తి చీర్లరవిసాగర్​, గుంటి రాజశేఖర్​, దేవర్లసాయికుమార్​  కోల్​కత, దిల్లీ, పట్నాలలో ఉన్న అంకిత్​, రాహుల్​, పంకజ్​  చెప్పినట్లుగా సైబర్​ నేరాలకు పాల్పడ్డారు  వనపర్తికి చెందిన నలుగురు..   ప్రజలను మోసం చేసి సేకరించిన డబ్బులో  70శాతం తీసుకుని, 30శాతం నేరగాళ్లకు   ఇచ్చేవారు.

 వీరందరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10వేల నుంచి 15వేల  మందికి ఫోన్ చేసి మోసాగించాలని చూశారు.  కానీ వెయ్యి  మందిని మోసగించి, అందరూ కలసి దాదాపు రూ.4 కోట్లు  కాజేశారన్నారు.   ఈ  సమావేశంలో  జిల్లా సైబర్ సెక్యూరిటి బ్యూరో డీఎస్పీ రత్నం, ఎస్సై  రవి ప్రకాష్, సీఐ కృష్ణయ్య,  టౌన్ ఎస్​ఐ  హరి ప్రసాద్లు పాల్గొన్నారు.