ఎన్టీపీసీకి నాలుగు అవార్డులు

జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ నాలుగు అపెక్స్​ సేఫ్టీ అవార్డులను సొంతం చేసుకుంది. శనివారం రాత్రి గోవాలో జరిగిన 9వ అపెక్స్  ఇండియా హెచ్ఆర్, సేఫ్టీ ఎక్సలెన్స్  అవార్డ్స్  ప్రోగ్రామ్​లో రామగుండం ఎన్టీపీసీ హెచ్ఆర్​ హెచ్​వోడీ బిజోయ్​కుమార్​ సిక్థర్​ అవార్డులను అందుకున్నారు. టెక్నాలజీ ఎక్సలెన్స్  విభాగంలో ప్లాటినం, హెచ్ఆర్  ఎక్సలెన్స్  విభాగంలో గోల్డ్, ట్రైనింగ్ ఎక్సలెన్స్  విభాగంలో గోల్డ్, ఆక్సుపేషనల్  హెల్త్  అండ్  సేఫ్టీ విభాగంలో గోల్డ్ అవార్డులు వరించాయి. 

ఎన్టీపీసీ ఆర్ఈడీకి..

ఎన్టీపీసీ రామగుండం, తెలంగాణ ప్రాజెక్టుల ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్, సదరన్​ రీజియన్​ ఈడీ కేదార్​ రంజన్​ పాండుకు ‘లీడర్​ సీఈవో ఆఫ్​ ది ఇయర్–2024’ అవార్డు లభించింది. అపెక్స్​ ఇండియా ఫౌండేషన్  నుంచి ఆయన ఈ ఆవార్డును అందుకున్నారు. ఎన్టీపీసీలో మానవ వనరుల వినియోగం, కార్పొరేట్​ నాయకత్వం, ప్రాంతీయ అభివృద్ధిపై చేసిన విశేష కృషికి ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.