కరీంనగర్ సిటీ, వెలుగు: కేంద్ర సెన్సార్ బోర్డులో కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు బీజేపీ నేతలకు చోటు దక్కింది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ఎంపీటీసీ రంగు భాస్కరాచారి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కల్యాణ్ చంద్ర, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి బండారి గాయత్రి, సీనియర్ నాయకుడు లడ్డు ముందడా బోర్డు మెంబర్లుగా నియమితులయ్యారు.
బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించినందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.