నాలుగు పడవలు బోల్తా పడి186 మంది గల్లంతు.. యెమెన్, జిబౌటి సముద్ర తీరాల్లో ఘటన.. ఇద్దరు మృతి

నాలుగు పడవలు బోల్తా పడి186 మంది గల్లంతు.. యెమెన్, జిబౌటి సముద్ర తీరాల్లో ఘటన.. ఇద్దరు మృతి

కైరో: యెమెన్, జిబౌటి సముద్ర తీరాల్లో గురువారం అర్ధరాత్రి వలసదారులతో కూడిన 4 బోట్లు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. 186 మంది గల్లంతయినట్లు యూఎన్ మైగ్రేషన్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. 

యెమెన్ తీరంలో రెండు పడవలు బోల్తా పడగా.. ఐదుగురు యెమెన్ సిబ్బందితోపాటు181 మంది వలసదారులు సముద్రంలో గల్లంతయ్యారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి తమీమ్ ఎలియన్  తెలిపారు. అలాగే..ఆఫ్రికన్ దేశమైన జిబౌటి తీరంలోనూ మరో రెండు పడవలు బోల్తా పడ్డాయన్నారు. 

అక్కడ ఇద్దరు వలసదారులు సముద్రంలో మునిగి చనిపోయారని.. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.