ఆదిలాబాద్​ కాంగ్రెస్ టికెట్​ కోసం నలుగురి దరఖాస్తులు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. సోమవారం డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డి హైదరాబాద్ లోని గాంధీభవన్​లో టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్​కు కలిసికట్టుగా దరఖాస్తులు అందజేశారు.

రానున్న ఎన్నికల్లో తమ ముగ్గురిలో ఎవరికి అవకాశం ఇచ్చిన కలిసి పనిచేస్తామని మీడియాతో వెల్లడించారు. ప్యారాషూట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వొద్దంటూ ఏఐసీసీ, టీపీసీసీ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇక మరో నేత కంది శ్రీనివాస్ రెడ్డి సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గంలో నలుగురు టికెట్ ​రేసులో ఉండటం ఆసక్తి రేపుతోంది.