
2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నలుగురు ఎంపీలు 25 ఏళ్లకే పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు. ఇందులో శాంభవి చౌదరి, పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్, సంజన జాతవ్ ఉన్నారు. పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్.. సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై గెలుపొందగా, శాంభవి చౌదరీ, సంజన జాతవ్.. లోక్‌జనశక్తి, కాంగ్రెస్ పార్టీ టికెట్లపై విజయం నమోదు చేశారు.
శాంభవి చౌదరి : బీహార్ మంత్రి అశోక్ చౌదరి కుమార్తెనే ఈ శాంభవి చౌదరి. ఈమె సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ నేత సన్నీ హజారీని ఓడించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రచారంలో భాగంగా యువ అభ్యర్థి అని శాంభవిని హైలైట్ చేశారు.
పుష్పేంద్ర సరోజ్ : సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి పుష్పేంద్ర సరోజ్ కౌశంబి పార్లమెంటరీ స్థానం నుంచి బీజేపీ ఎంపీ .వినోద్ కుమార్ సోన్కర్ పై లక్ష మెజారిటీతో సాధించారు. పుష్పేంద్ర ఐదుసార్లు ఎమ్మెల్యే, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి అయిన ఇంద్రజిత్ సరోజ్ కుమారుడు.
ప్రియా సరోజ్ : సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రియా సరోజ్ మచ్లిషహర్ పార్లమెంటరీ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ భోలానాథ్‌పై 35,850 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన తూఫాని సరోజ్ కుమార్తె.
సంజన జాతవ్ : రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సంజనా జాతవ్ 51,983 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్ కోలీపై విజయం సాధించారు. గతంలో ఆమె 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 409 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ ఖేడీ చేతిలో ఓడిపోయారు. రాజస్థాన్ పోలీస్‌లో కానిస్టేబుల్ అయిన కప్తాన్ సింగ్‌ని సంజన వివాహం చేసుకుంది.