రాజస్థాన్ లోని అజ్మీర్ జంక్షన్ వద్ద రైలు పట్టాలు తప్పింది. అజ్మీర్-సీల్దా ఎక్స్‌ప్రెస్‌లోని నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ తెలిపారు. ఈ సంఘటన వల్ల రైళ్ల రాకపోకల్లో ఎలాంటి అంతరాయం కలగలేదని, రెండో లైను గుండా రైళ్లు వెళ్తున్నాయన్నారు. కోచ్‌లను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
మెయింటెనెన్స్ నిమిత్తం రైలు మదార్ యార్డ్‌కు వెళ్తుండగా 12988 అనే నంబరు గల రైలు పట్టాలు తప్పినట్లు అధికారులకు సమాచారం అందింది. అనంతరం రైలు పట్టాలు మార్చే ప్రక్రియ ప్రారంభమైందని, రేక్ ఖాళీగా ఉన్నందున, ఎవరికీ ఎటువంటి గాయాలు గానీ, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.
డిసెంబర్ నెల ప్రారంభంలో, ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కసారా - సెంట్రల్ రైల్వే నెట్‌వర్క్‌లోని TGR-3 స్టేషన్ మధ్య డిసెంబర్ 24న గూడ్స్ రైలుకు చెందిన ఏడు లోడెడ్ వ్యాగన్లు పట్టాలు తప్పాయని ఒక అధికారి తెలిపారు. రైలు పట్టాలు తప్పడం వల్ల డౌన్‌లైన్‌లోని కసర-ఇగత్‌పురి సెక్షన్‌లో మెయిల్ ఎక్స్‌ప్రెస్ ట్రాఫిక్ నిలిచిపోయిందని, మిడిల్ లైన్ ప్రభావితమైందన్నారు.
#WATCH | Ajmer, Rajasthan: Four coaches of Ajmer-Sealdah Express derailed this morning at around 7.50 at the Madar Railway Yard due to rollover while releasing the safety brakes. Railway officials and DRM are at the spot, and the operations to put the four coaches back on the… pic.twitter.com/oOtE19tsmP
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 25, 2023