హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని వెన్నుపోటు పొడవాలని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల పేర్లు తనకు తెలుసని, వారి పేర్లు రాహుల్ గాంధీకి చెప్పానన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు గుండు గీసి పైకి పంపిస్తా అని హెచ్చరించారు.
బుధవారం అమీర్‌పేటలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో పాల్ మాట్లాడారు. శుక్రవారం నుంచి గ్లోబల్ పీస్ సమ్మిట్ నిర్వహిస్తున్నానని, దీనికి సీఎం రేవంత్ హాజరవుతున్నారని తెలిపారు. ఇక నటుడు చిరంజీవికి పద్మవిభూషణ్ ఎలా ఇస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. సోనూ సూద్‌కు పద్మవిభూషణ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.