వరుసగా నాలుగు రోజులు సెలవులు..హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ

వరుసగా నాలుగు రోజులు సెలవులు..హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ

హైదరాబాద్: తెలంగాణలో పండుగలు, సాధారణ సెలవు దినాలు కలిపి మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 14న రెండవ శనివారం, 15న ఆదివారం, 16న సోమవారం మీలాద్ ఉన్ నబీ, 17న మంగళవారం చతుర్దశి న గణేష్ నిమజ్జనోత్సవాలు వచ్చాయి.  ఈ మధ్య కాలంలో ఒకేసారి వరుస సెలవులు రావడం ఇదే మొదటిసారి.  

వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో అటు ఉద్యోగులు, ఇటు విద్యార్థులు  ఎంజాయ్ చేస్తున్నారు. పండుగలు రావడంతో సొంత ఊళ్లకు , సిటీ శివారు ఫాంహౌజ్ లకు క్యూ కట్టారు. మరికొంత మంది వారాంతపు సెలవులను గణేష్ పూజలో గడుపుతున్నారు. మరికొంతమంది  కుటుంబంతో ఊళ్లకు వెళ్లుతున్నారు.

Also Read :- హైదరాబాద్- నాగ్‌‌పూర్ మధ్య కొత్త వందే భారత్‌‌ రైలు  

మరోవైపు హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతున్నాయి. 8 వరోజు  ఖైరాతాబాద్ బడా గణేష్ పూజలందుకున్నారు.. మహాగణపతిని దర్శించుకునేందుకు హైదరాబాద్ సిటీతోపాటు పరిసర ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలనుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. సెలవు దినాలు కావడం తో బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలిస్తున్నారు.