ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి నలుగురు పోటీ

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడంతో ఆ పదవిని దక్కించుకునేందుకు నలుగురు కౌన్సిలర్లు పోటీపడుతున్నారు. 

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్​పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బల నిరూపణ ఉంటుందని భావించి సదరు కౌన్సిలర్లు ఇప్పటికే వైస్ చైర్మన్ సీటు కోసం అనుకూలమైన నాయకుల వద్ద పైరవీలు షురూ చేసినట్లు సమాచారం. ఈ పదవి రేసులో ఎస్సీ వర్గానికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్​తో పాటు, స్వతంత్ర కౌన్సిలర్, కాంగ్రెస్​కు చెందిన ఇద్దరు మహిళా కౌన్సిలర్లు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.