సత్తా చాటిన ఇచ్చోడ కేజీబీవీ ఉద్యోగులు

  •     ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నలుగురు సీఆర్టీలు
  •     ఓ గిరిజన మహిళకు ఏకంగా 3 కొలువులు

ఇచ్చోడ, వెలుగు : ఇచ్చోడలోని కేజీబీవీలో పనిచేస్తున్న సీఆర్టీలు సత్తా చాటారు. నలుగురు మహిళలు ప్రభుత్వ కొలువులు సాధించారు. ఓ ఆదివాసీ గిరిజన మహిళ ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అదిలాబాద్​లోని భుక్తాపూర్​కు చెందిన సిడాం పద్మిని ఇచ్చోడలోని కేజీబీవీలో పీజీ సీఆర్టీ ఎకనామిక్స్ లెక్చరర్​గా పనిచేస్తు న్నారు. ఇటీవల విడుదలైన టీజీటీ, పీజీటీ, జేఎల్ పోస్టులకు ఎంపికయ్యారు.

జేఎల్ ఎకనామిక్స్ లో జిల్లా టాపర్​గా నిలవడం విశేషం. భర్త గంగారాం ప్రోత్సాహం, కొడుకు సాయి కిషోర్ సహకారం కూడా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇదే పాఠశాలలో బోధిస్తున్న ప్రేమల రూప అనే సీఆర్టీ నర్సింగ్ ఆఫీసర్​గా ఆదిలాబాద్ రిమ్స్​లో జాబ్ సాధించగా.. మాధురి, మోహి జుబిన్ అనే సీఆర్టీలు కూడ టీజీటీ ఉద్యోగాలు సాధించారు. దీంతో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ జి.మల్లిక శనివారం వారిని శాలువాలతో సన్మానించి అభినందించారు.