సిద్దిపేట, వెలుగు: పట్టణానికి చెందిన కొంక రామచంద్రం, శారద దంపతుల నలుగురు కుమార్తెలు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. పట్టుదలతో కష్టపడి చదివి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు. పెద్ద అమ్మాయి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. రెండో అమ్మాయి మూడో సంవత్సరం చదువుతుండగా, చివరి ఇద్దరు కవల పిల్లలు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందారు.
పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ లో సీట్లు పొందిన అక్కాచెల్లెల్లు క్యాంపు ఆఫీసులో మాజీ మంత్రి హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్బంగా ఆయన వారిని అభినందించి రోహిణి, రోషిణిల చదువుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించడమే కాకుండా భవిష్యత్‌లో సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.