
చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు టౌన్‌లోని సితార గ్రాండ్ హోటల్ లో గురువారం మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తనిఖీ చేశారు. నాలుగు రోజుల కిందటి కుళ్లిపోయిన మాంసాన్ని నిల్వ ఉంచినట్టు గుర్తించారు. కూరల్లో వాడే పదార్థాలన్నీ ఎక్కువ రోజులుగా నిల్వ ఉంచడం వల్ల దుర్వాసన వస్తున్నాయని, అందులో ఉన్న ఏ ఒక్క పదార్థం కూడా తినేలాగా లేదని కమిషనర్పేర్కొన్నారు.
హోటల్ ఓనర్‌కు రూ.8 వేల ఫైన్ వేశామని తెలిపారు. ఫ్రెష్చికెన్, మటన్మాత్రమే వండాలని సూచించారు. లేకుంటే హోటల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్కుమార్, ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ పి.హరికాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.