సూర్యాపేటలో విషాదం.. ఫ్రెండ్ పెండ్లికి బైక్పై వెళుతూ.. ఆగిన లారీని ఢీ కొట్టడంతో ప్రాణం పోయింది

సూర్యాపేటలో విషాదం.. ఫ్రెండ్ పెండ్లికి బైక్పై వెళుతూ.. ఆగిన లారీని ఢీ కొట్టడంతో ప్రాణం పోయింది

నేరేడుచర్ల, వెలుగు: ఆగిన లారీని ఢీ కొని స్టూడెంట్ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపిన ప్రకారం.. పాలకవీడు మండలం బెట్టతండాకు చెందిన బడావత్ సందీప్(20) హైదరాబాద్ లోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. హోలీ పండుగకు ఇంటికి వచ్చిన అతడు నల్గొండ జిల్లా హాలియాలో జరిగే ఫ్రెండ్ పెండ్లికి సోమవారం తన తండ్రి బైక్ తీసుకుని వెళ్తున్నాడు. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద రోడ్డుపై ఆగిన లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. దీంతో అతనికి తీవ్రగాయాలు కావ డంతో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. బడావత్ శ్రీను నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు.  

మెదక్ జిల్లాలో కంటైనర్ ఢీకొని యువకుడు..
మెదక్ (చేగుంట) : ట్రాక్టర్ ను కంటైనర్ ఢీకొట్టడంతో యువకుడు చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.  హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు సోమవారం ఉదయం కంటైనర్ లారీ వెళ్తుంది. నార్సింగి మండలం వడ్డెర కాలనీ సమీపంలో నేషనల్ హైవే –44 మీద పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్ ను వెనుక ఢీ కొట్టింది.  ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చున్న బోస్ ప్రకాశ్ (19) తీవ్రంగా గాయపడి స్పాట్ లో మృతిచెందాడు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం రామాయంపేట ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

జగిత్యాల జిల్లాలో బైక్ పై వెళ్తూ చెట్టును ఢీకొని మరొకరు..
మల్లాపూర్: బైక్ యాక్సిడెంట్ లో యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.  మెట్ పల్లి టౌన్ కు చెందిన  గోనెల రాజ్ కుమార్(28) సోమవారం మల్లాపూర్ మండలం రాఘవపేట్ లో శుభకార్యానికి తన పల్సర్ బైక్ పై వెళ్లాడు. తిరిగి స్పీడ్ గా వెళ్తుండగా ప్రమాదవశాత్తు ముత్యంపేట్ శివారులోని చెట్టును ఢీకొట్టాడు. దీంతో అతని తలకు తీవ్రగాయలవగా నిజామాబాద్ లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి తండ్రి రమేశ్​ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

మహబూబ్బాద్ జిల్లాలో విద్యుత్ ఆపరేటర్..
గూడూరు: యాక్సిడెంట్ లో విద్యుత్ ఉద్యోగి మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం పోలెపల్లికి చెందిన యాకస్వామి గూడూరు మండల కేంద్రంలో అద్దెకు ఉంటూ భూపతిపేట విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్గా చేస్తున్నాడు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలో సొంత పని మీద బైక్ పై వెళ్లి వస్తుండగా గూడూరు మండలం బొద్దుగొండ శివారులో హైవేపై గుర్తు తెలియని వెహికల్ ఢీకొట్టి.. అతని తలపై నుంచి వెళ్లడంతో స్పాట్లో చనిపోయాడు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ గిరిధర్ రెడ్డి తెలిపారు.