ట్రాక్టర్ను ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు..నలుగురు మృతి

ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేసర్ నుంచి పందర్ పూర్ వెళ్తుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు  ట్రాక్టర్  ఢీ కొట్టి  కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో   నలుగురు అక్కడిక్కడే చనిపోగా..  మరో 42 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  గాయపడిన వారిని దగ్లరలోని MGM ఆసుపత్రికి తరలించారు ముంబై పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ALSO READ : జమ్మూ కశ్మీర్లో ఎదురుకాల్పులు..నలుగురు జవాన్లు మృతి

 ఆషాడి ఏకాదశి సందర్భంగా 54 మందితో ప్రైవేట్  బస్సు డోంబివిలీలోని కేసర్ గ్రామం నుంచి పండర్‌పూర్‌కు వెళ్తుండగా జూలై 15న  అర్థరాత్రి ముంబై పూణె హైవై దగ్గర ట్రాక్టర్ ను ఢీ కొట్టినట్లుపోలీసులు తెలిపారు. క్రేన్ సాయంతో బస్సును వెలికితీశారు. ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేలోని ముంబై-లోనావాలా లేన్‌లో 3 గంటల తర్వాత వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు పోలీసులు.