IND vs NZ Final: ఒకటి పట్టి నాలుగు వదిలేశారు: ఫైనల్లో ఇండియా చెత్త ఫీల్డింగ్

IND vs NZ Final: ఒకటి పట్టి నాలుగు వదిలేశారు: ఫైనల్లో ఇండియా చెత్త ఫీల్డింగ్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా బౌలింగ్ లో రాణిస్తున్నా ఫీల్డింగ్ లో తడబడుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు క్యాచ్ లను నేల పాలు చేశారు. ఆట ప్రారంభంలో రచీన్ రవీంద్ర ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను షమీ  జారవిడిచాడు. అసలే బౌండరీలతో పరుగుల వరద పారిస్తున్న రచీన్ ఆ తర్వాత కుల్దీప్ వేసిన బంతికి బౌల్డవ్వడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. పవర్ ప్లే లో వేగంగా 37 పరుగులు చేసి న్యూజిలాండ్ మంచి ఆరంభం ఇచ్చాడు. 

అక్షర్ వేసిన ఇన్నింగ్స్ 35 ఓవర్ ఐదో బంతికి రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేశాడు. మిచెల్ మిడాన్ దిశగా ఆడిన ఈ బాల్ రోహిత్ శర్మ చేతులను  కింద పడింది. కష్టమైన క్యాచ్ అయినప్పటికీ హిట్ మ్యాన్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ సమయంలో మిచెల్ 40 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక జడేజా వేసిన 36 ఓవర్లో చివరి బంతిని ఫిలిప్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా బిగ్ షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గిల్ వేగంగా బౌండరీ దగ్గరకి వచ్చిన క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. 34 పరుగులు చేసి మంచి ఊపు మీదున్న ఫిలిప్స్ ను ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. 

ALSO READ | IPL 2025: ప్లేయర్ కోచ్‌గా మారిన వేళ: గుజరాత్ అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్

ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్ విషయానికి వస్తే 40 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్  5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజ్ లో మిచెల్ (48), బ్రేస్ వెల్ (3) ఉన్నారు. రచీన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ (34) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు పడగొట్టారు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.