మినీ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. నలుగురు ఉద్యోగులు సజీవ దహనం

మినీ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. నలుగురు ఉద్యోగులు సజీవ దహనం

ముంబై: పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న టెంపో వాహనం (మినీ బస్)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలోని నలుగురు ఉద్యోగులు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని హింజెవాడి వద్ద బుధవారం (మార్చి 19) ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. పూణే సమీపంలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన వాహనం మంటల్లో చిక్కుకుని నలుగురు ఉద్యోగులు మృతి చెందారని హింజెవాడి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్ గైక్వాడ్ తెలిపారు.

టెంపో ట్రావెలర్ బుధవారం (మార్చి 19) కంపెనీలోని కొంతమంది ఉద్యోగులను వారి కార్యాలయానికి తీసుకెళ్తుండగా ఇంజన్‎లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. దీంతో వాహనంలోని నలుగురు ఉద్యోగులు బయటకు రాలేక అందులోనే సజీవ దహనమయ్యారని వెల్లడించారు. మరికొందరు ఉద్యోగులు వాహనం నుంచి గాయాలతో బయటపడ్డారని చెప్పారు. వాహనం నుంచి మృతదేహాలను వెలికితీసి పోస్ట్‎మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. మృతి చెందిన ఉద్యోగుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

ALSO READ | నాగ్పూర్ హింస కేసు..లోకల్ పొలిటికల్ లీడర్ ఫయీమ్ ఖాన్ అరెస్ట్