ఏపీలో ఘోరం: లారీని ఢీకొన్న మినీ వ్యాన్.. నలుగురు స్పాట్ డెడ్..

ఏపీలో ఘోరం: లారీని ఢీకొన్న మినీ వ్యాన్.. నలుగురు స్పాట్ డెడ్..

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. సత్యసాయి జిల్లాలో శనివారం ( డిసెంబర్ 21, 2024 ) తెల్లవారుజామున చోటు చేసుకుంది ఈ ప్ర‌మాదం. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మ‌రో 10 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివ‌రాలిలా ఉన్నాయి.

సత్యసాయి జిల్లా అమ‌రాపురం, గుడిబండ‌, మండ‌లాల‌కు చెందిన 14 మంది ఒక మినీ వ్యాన్‌లో తిరుమల వెళ్లి వస్తుండగా మ‌డ‌క‌శిర మండ‌లం బుళ్ల‌స‌ముద్రం దగ్గర  ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది మిని వ్యాన్. దీంతో మినీ వ్యాన్‌లో ప్ర‌యాణిస్తున్నవారిలో న‌లుగురు అక్క‌డికక్క‌డే మృతి చెందగా మ‌రో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

Also Read :- మూడు రోజుల పాటు భారీ వర్షాలు

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను నిమిత్తంబెంగ‌ళూరులోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.