నలుగురు నకిలీ నక్సలైట్లు అరెస్ట్ ‌‌

నలుగురు నకిలీ నక్సలైట్లు అరెస్ట్ ‌‌
  • రూ. 5 కోట్లు ఇవ్వాలని రైల్వే కాంట్రాక్టర్ ‌‌కు బెదిరింపు

సికింద్రాబాద్, వెలుగు : నక్సలైట్లమంటూ రైల్వే కాంట్రాక్టర్ ‌‌ నుంచి డబ్బులు డిమాండ్ ‌‌ చేసిన నలుగురు వ్యక్తులను ఓయూ పోలీసులు అరెస్ట్ ‌‌ చేశారు. కేసుకు సంబందించిన వివరాలను ఓయూ డివిజన్ ‌‌ ఏసీపీ జగన్ ‌‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. కాప్రాకు చెందిన ఇంటీరియర్ ‌‌ డిజైనర్ ‌‌ సాలొంక ప్రసాద్ ‌‌ అలియాస్ ‌‌ ప్రదీప్ ‌‌, మియాపూర్ ‌‌ ఆల్విన్ ‌‌ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ‌‌ రత్లావత్ ‌‌ రవినాయక్ ‌‌, రంగారెడ్డి జిల్లా వెంకన్నగూడకు కార్పెంటర్ ‌‌ కమ్మరి శేషప్ప, లక్ష్మారావుగూడకు చెందిన మందగుల సత్తయ్య గ్రూప్ ‌‌గా ఏర్పడ్డారు. 

తాము చేస్తున్న పనులతో వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో నక్సలైట్లుగా అవతారమెత్తారు. తార్నాక విజయ డెయిరీ సమీపంలో ఉండే రైల్వే కాంట్రాక్టర్ ‌‌ జి.సురేశ్ ‌‌ సెల్ ‌‌ నంబర్ ‌‌ తెలుసుకొని తాము నక్సలైట్ల గ్రూప్ ‌‌, జై భీమ్ ‌‌ సంస్థలకు చెందిన వాళ్లమని, తమకు రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ గత నెల 26న సురేశ్ ‌‌కు ప్రసాద్ ‌‌ నంబర్ ‌‌ నుంచి వాట్సప్ ‌‌లో మెసేజ్ ‌‌ పెట్టారు. మెసేజ్ ‌‌తో పాటు అతడి అన్న సతీశ్ ‌‌, మరో ఇద్దరు బంధువుల ఇంటి అడ్రస్ ‌‌లు, ఫోన్ ‌‌ నంబర్లు లోకేషన్ ‌‌ను షేర్ ‌‌ చేశారు. డబ్బులను 12 గంటల్లో అందజేయాలని, ఈ విషయాన్ని పోలీసులకు గానీ మరెవరికైనా చెబితే అతడి అన్న సతీశ్ ‌‌ను చంపేస్తామని బెదిరించారు. 

సురేశ్ ‌‌ స్పందించకపోవడంతో 27న సాయంత్రం రెండుసార్లు ఫోన్ ‌‌ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో 6.18 గంటలకు ‘ఏమైంది సురేశ్ ‌‌.. ఏమీ సమాధానం చెప్పడం లేదు.. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు.. నా మెసేజ్ ‌‌కు రెస్పాండ్ ‌‌ కాకపోతే నీ కుటుంబసభ్యులకు హాని కలుగుతుంది, తార్నాకలోని మీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తాం.. వెంటనే సమాధానం ఇవ్వు.. 

జై భీమ్’ అంటూ వాట్సప్ ‌‌లో మెసేజ్ ‌‌ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన సురేశ్ ‌‌ ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంక్వైరీ చేసిన పోలీసులు సాలొంక ప్రసాద్ ‌‌తో పాటు రవినాయక్, శేషప్ప, సత్తయ్యను అరెస్ట్ ‌‌ చేసి, వారి వద్ద నుంచి ఐదు మొబైల్స్ ‌‌, సిమ్ ‌‌ కార్డులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.