ఒక్కరోజే నాలుగు అగ్ని ప్రమాదాలు

ఒక్కరోజే నాలుగు అగ్ని ప్రమాదాలు
  • ఒక్కరోజే నాలుగు అగ్ని ప్రమాదాలు
  • కూకట్​పల్లిలోని  4 స్క్రాప్ యార్డులు, ప్లాస్టిక్ బాటిల్స్ షెడ్లలో మంటలు 
  • కాలిపోయిన సామగ్రి..  గూడ్స్ వెహికల్, కారు దగ్ధం
  • లంగర్​హౌస్​లోని స్క్రాప్ గోడౌన్​లో ప్రమాదం
  • కొండాపూర్ కియా షోరూంలో షార్ట్​సర్క్యూట్  


కూకట్​పల్లి/మెహిదీపట్నం/కొండాపూర్, వెలుగు:  స్క్రాప్ ఓపెన్ యార్డులు, ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ షెడ్లలో మంటలు చెలరేగిన ఘటన కూకట్​పల్లి  ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్​పల్లి పరిధి ప్రశాంత్​నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని నాలుగు స్క్రాప్ ఓపెన్ యార్డుల్లో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మంటలు చెలరేగాయి.  పక్కనే ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ షెడ్లకు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో లోపల సామగ్రి మంటల్లో కాలిపోయింది. అక్కడే పార్కు చేసి ఉన్న గూడ్స్ వెహికల్స్, కారుకు సైతం మంటలంటుకుని దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, డీఆర్ఎఫ్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఇతర కంపెనీలకు వ్యాపించకుండా ఫైరింజన్లతో అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు, ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.

లంగర్​హౌస్​లో.. 


లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో మీర్జా ఇస్మాయిల్ అనే వ్యక్తికి చెందిన స్క్రాప్​ గోడౌన్​లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్ పక్కన ఉన్న చెత్తకుప్ప కారణంగా మంటలు చెలరేగి లోపలికి వ్యాపించాయి.  పక్కనే ఉన్న శానిటరీ గోడౌన్​కు సైతం మంటలు వ్యాపించడంతో సామగ్రి కాలిపోయింది. మంటలు, దట్టమైన పొగకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్తీలో స్క్రాప్ గోడౌన్​కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ బల్దియా అధికారులపై స్థానికులు మండిపడ్డారు. వాటిని మరోచోటుకి తరలించాలని డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి ఇక్కడ స్క్రాప్ గోడౌన్లు ఏర్పాటు చేస్తున్నారని.. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు కంప్లయింట్ చేసినా పట్టించుకోలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. 

‘ఆచార్య’ పాత సెట్​లో మంటలు

నార్సింగి మున్సిపాలిటీ పరిధి కోకాపేటలోని ఆచార్య సినిమా పాత సెట్​లో అగ్నిప్రమాదం జరిగింది. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ తర్వాత కూడా ఆ సెట్​ను అలాగే ఉంచారు. సోమవారం సెట్​లో మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది వాటిని ఆర్పివేశారు. ఎవరో సిగరేట్ తాగి పడేయడంతో మంటలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.


కియా షోరూంలో..


 కొండాపూర్​లోని కియా కార్ల షోరూంలోనూ అగ్ని ప్రమాదం​ జరిగింది.  షోరూంలో ఉన్న కార్లకు సంబంధించిన వస్తువులు​ కాలిబూడిదయ్యాయి. కొండాపూర్​ ఆర్టీఏ ఆఫీస్​ సమీపంలో కియా షోరూం ఉంది. షోరూం వెనుకాలే యాక్ససరీస్ ​షెడ్ ​కొసాగుతోంది. ఇదే షెడ్​లో వోక్స్​వ్యాగన్​ కంపెనీకి సంబంధించిన యాక్ససరీస్ ​సెంటర్​ కూడా ఉంది. సోమవారం తెల్లవారు జామున 2.20 గంటలకు షెడ్​లో మంటలు చెలరేగాయి. దీంతో కార్ల సీటు కవర్లు, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. వెంటనే స్పాట్​కు చేరుకున్న మాదాపూర్​ఫైర్​ సిబ్బంది రెండు ఫైరింజిన్లతో గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్​ సర్క్యూట్​ వల్లనే ప్రమాదం జరిగిందని, రూ.70 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.

వరుస ప్రమాదాలతో అధికారులు అలర్ట్

హైదరాబాద్, వెలుగు: సమ్మర్‌‌ ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. పెరిగిపోయిన టెంపరేచర్‌‌‌‌తో  వరుస ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఫైర్‌‌‌‌ సేఫ్టీ లేకపోవడం, షార్ట్ సర్క్యూట్‌‌ కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు ఫైర్‌‌‌‌ సర్వీసెస్‌‌ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యం లోనే ప్రమాదాల నివారణకు ఫైర్ డిపార్ట్‌‌మెంట్‌‌ సమ్మర్ యాక్షన్ ప్లాన్​ను రూపొందిస్తోంది.

షార్ట్‌‌సర్క్యూట్​తోనే ఎక్కువ ..

ఎండలు పెరగడంతో కరెంట్ వాడకం పెరిగిపోయింది. షాపింగ్ కాంప్లెక్సుల్లో ఏసీలు, కంపెనీల్లో బాయిలర్స్‌‌ హీటెక్కి ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నాసిరకం కేబుల్స్ హీటెక్కి షార్ట్‌‌ సర్క్యూట్లు జరుగుతున్నట్లు కేస్ స్టడీస్‌‌లో తేలింది. గ్రేటర్ లిమిట్స్‌‌లోని అనేక కంపెనీలు, కమర్షియల్ కాంప్లెక్స్​లు, అపార్ట్ మెంట్లు ఫైర్ సేఫ్టీ రూల్స్‌‌ పాటించడం లేదు. హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌‌ల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌‌మెంట్​ను నామమాత్రంగానే  మెయింటెయిన్‌‌ చేస్తున్నట్లు తేలింది. కేవలం15 శాతం బిల్డింగ్స్​లో మాత్రమే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్‌‌ తీసుకుంటున్నట్లు ఫైర్‌‌‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ గుర్తించింది. ఇలాంటి వాటిని గుర్తించి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ప్లాన్ రెడీ చేస్తున్నారు. 

ఫైర్ ఫైటర్స్ రెడీ

గ్రేటర్‌‌‌‌ లిమిట్స్‌‌లో మొత్తం 36 ఫైర్‌‌‌‌ స్టేషన్లు ఉన్నాయి. వీటిల్లో 70 మిస్ట్‌‌ బుల్లెట్స్‌‌ అందుబాటులో ఉన్నాయి. ల్యాడర్‌‌‌‌ మెషీన్లు, వాటర్‌‌ ‌‌కెపాసిటీ ఎక్కువగా ఉన్న డోజర్స్‌‌,10 రకాల అధునాతన పరికరాలు ఫైర్‌‌‌‌ సర్వీసెస్‌‌ వద్ద ఉన్నాయి. మొత్తం 450 మంది ఫైర్ సిబ్బంది ఆన్‌‌డ్యూటీలో ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను అదుపు చేయడం, బాధితులను కాపాడటంలో అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఫైర్‌‌‌‌మెన్ దగ్గర నుంచి ఫైర్ ఇంజన్‌‌ డ్రైవర్‌‌ ‌‌వరకు ట్రైనింగ్‌‌ పొందారు.

పాటించాల్సిన ఫైర్ సేఫ్టీ రూల్స్

  • నేషనల్‌‌ బిల్డింగ్‌‌ కోడ్ రూల్స్‌‌ కచ్చితంగా ఫాలో కావాలి.
  •   నాసిరకం ఎలక్ట్రికల్‌‌ కేబుల్స్‌‌, మెటీరియల్‌‌ వాడకూడదు.
  •   స్మోక్ డిటెక్టర్లు, స్పింకర్లు, జాకీ, పంపులు ఏర్పాటు చేసుకోవాలి.
  •   ఫైర్ అలారం, మంటలను ఆర్పే ఫోమ్‌‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
  •   ఫైర్ ఇంజిన్ ఫ్రీ మూవ్‌‌మెంట్ కోసం చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి.
  •   మంటల నుంచి ఎస్కేప్ కావడానికి ఎగ్జిట్‌‌, ఎంట్రీ విశాలంగా ఏర్పాటు చేయాలి.   
  •   ప్రతి అపార్ట్‌‌మెంట్‌‌లో 50 వేల లీటర్ల గ్రౌండ్‌‌ వాటర్‌‌‌‌, సుమారు 15 వేల లీటర్ల ఓవర్ హెడ్ టాంకులు ఉండాలి.