నర్సరీతో ఆ నలుగురు.. ఉద్యోగాలు పోవడంతో సొంత బిజినెస్

ఉద్యోగాలు పోవడంతో వ్యాపారులయ్యిన్రు

వాళ్లంతా బాగా చదువుకున్నరు. పదిమందికి పాఠాలు చెప్పేందుకు బడిలో పంతుళ్లు అయ్యిండ్రు. కొన్నేండ్లపాటు ప్రైవేటు స్కూల్‌‌‌‌లో పనిచేసిన్రు. కరోనా వల్ల స్కూళ్లు మూతపడటంతో ఉద్యోగాలు పొయినయ్‌‌‌‌. జాబ్స్‌‌‌‌ పోయినందుకు డీలా పడలేదు. చెరుకు మొలకలను ఉత్పత్తి చేసే నర్సరీని పెట్టి సక్సెస్‌‌‌‌ అయ్యిండ్రు కుప్రియాల్‌‌‌‌కు చెందిన ఈ నలుగురు యువకులు. వాళ్లు బాగుపడడమే కాకుండా.. మరో పదకొండు మందికి పని కల్పిస్తున్నారు.

సెల్ఫ్‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌ ఉంటే ఏ రంగంలోనైనా సక్సెస్‌‌‌‌ అవ్వొచ్చని నిరూపించిన వీళ్ల పేర్లు కమిటి నరేష్, రెడ్డి రాజశేఖర్, చెవ్వ రాజు, చెవ్వ సంతోష్. వీళ్ల సొంతూరు కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండలం కుప్రియాల్‌‌‌‌. వీళ్లంతా చిన్నప్పటి నుంచీ స్నేహితులు. నరేశ్‌‌‌‌, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌, రాజు బీఈడీ చేసి ఓ ప్రైవేట్​స్కూల్‌‌‌‌లో టీచర్లుగా పని చేశారు. సంతోష్‌‌‌‌ అదే స్కూల్‌‌‌‌లో బస్సు డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా చేసేవాడు. పోయిన ఏడాది కరోనా కారణంగా స్కూళ్లు మూతపడటంతో వీళ్ల ఉద్యోగాలు పోయి రోడ్డునపడ్డారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నవాళ్లకి .. చెరుకు మొలకలు సాగు చేయాలన్న ఐడియా వచ్చింది. అనుకున్నదే తడవుగా దానికి సంబంధించిన గ్రౌండ్‌‌‌‌ వర్క్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశారు. ఎకరం భూమిని లీజుకు తీసుకుని, లోకల్‌‌‌‌గా ఉన్న ప్రైవేటు షుగర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ మేనేజ్‌‌‌‌మెంట్ సాయంతో నర్సరీ స్టార్ట్‌‌‌‌ చేశారు.  నర్సరీ మొదలుపెట్టేందుకు అవసరమైన ట్రేలు,  చెరకు గడల కటింగ్​ మిషన్లు,  కోకాఫేట్​( బయో పెస్టిసైడ్), ఇతర కెమికల్స్​, మొలకలు సప్లయ్​ చేసేందుకు మినీ వ్యాన్​కు కలిపి మొత్తం రూ.10 లక్షల వరకు ఖర్చు అయ్యింది. ఈ నర్సరీలో పనిచేసేందుకు 11 మంది మహిళా కూలీలను పెట్టుకుని, వాళ్లకి పని ఇస్తున్నారు. వ్యవసాయంపై పట్టు ఉండటంతో ఆ నర్సరీని సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా రన్‌‌‌‌ చేస్తున్నారు.

మొలకల ఉత్పత్తి

చెరకు గడలను మిషన్లతో చిన్న చిన్న ముక్కలుగా కట్‌‌‌‌ చేస్తారు. ఆ ముక్కలను కోకాఫేట్‌‌‌‌ వేసిన ట్రేలలో వేసి పెడతారు. దాదాపు 30 ‌‌‌‌‌‌‌‌– 40 రోజుల్లో  మొలకలు రెండు నుంచి నాలుగు ఇంచులు పెరుగుతాయి. ఒకేసారి 80 వేల నుంచి లక్ష వరకు మొలకలు వస్తాయి. ఆ మొలకలనే రైతులకు ఒక్కోటి రెండు రూపాయల చొప్పున అమ్ముతున్నారు. మామూలుగా అయితే రైతులు చెరకు గడలను నరికి వాటిని నేరుగా భూమిలో తొక్కేవారు. వాటి నుంచి పిలకలు మొలిచి పంట వచ్చేది. ఆ పద్ధతి ఖర్చుతో కూడుకున్నది. కూలీలు కూడా బాగా అవసరమయ్యేవాళ్లు. అయితే, ఈ మొలకలు తెచ్చి నాటుకుంటే ఖర్చు తగ్గుతుందని, టైం కలిసొస్తుందని చెప్తున్నారు రైతులు. ఇప్పటి వరకు దాదాపు3 లక్షల సింగిల్​ కన్ను మొలకలు, 2.78 లక్షల 2 కళ్ల మొలకలను సప్లై​ చేశారు ఈ నలుగురు స్నేహితులు.

మా కాళ్లపై మేమే నిలబడాలని

స్కూళ్లు మూతపడ్డాక ఏం చేయాలో పాలుపోలేదు. నెక్స్ట్​ఏంటన్న ఆలోచన మొదలైంది. ఆ టైంలోనే మా బంధువుల్లో ఒక మహిళ చెరుకు మొలకలు ఉత్పత్తి చేసే నర్సరీలో పనికి వెళ్లడం చూసి మాకు ఈ ఐడియా వచ్చింది. చెరుకు మొలకలకు రైతుల నుంచి కూడా మంచి డిమాండ్​ ఉంది.  ఫ్యాక్టరీ వాళ్లు, లోకల్‌‌‌‌ రైతులు సహకారం అందించడంతో దీన్ని స్టార్ట్‌‌‌‌ చేశాం. మాతో పాటు మరో 11 మందికి పని ఇవ్వడం ఆనందంగా ఉంది. ఏ పనైనా చేయాలనే తపన ఉంటే ఎక్కడైనా విజయం సాధించొచ్చు.

– చెవ్వ రాజు

For More News..

నా వాట్సాప్ చాట్​లను లీక్ చేయొద్దు

తెలంగాణలో ఈ టూరిస్ట్​ ప్లేస్​లని చుట్టొద్దమా..

బిట్టు శ్రీను.. లాయర్​ దంపతుల హత్య వెనుక కొత్త పేరు