మిడ్ మానేర్​ నాలుగు గేట్లు ఓపెన్

శ్రీరాజరాజేశ్వర జలాశయం(మిడ్‌మానేర్​) నాలుగు గేట్లు ఎత్తి సోమవారం ఎల్ఎండీలోకి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌, ప్లానింగ్​కమిషన్​వైస్​చైర్మన్​వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం మిడ్ మానేరులో15 టీఎంసీలు, ఎల్ఎండీలో 7 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. 

ALSO READ :‘సదర్మాట్’లో పడి యువకుడు మృతి

ఈ సీజన్‌లో ఆయకట్టుకు 20 టీఎంసీలు అవసరం ఉందని, ఈ నెల 25 నుంచి సూర్యాపేట జిల్లా వరకు నీటిని తరలించి రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఎల్ఎండీ ఎగువన ఉన్న మల్యాల వరకు నీటిని అందిస్తామన్నారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఈఎన్సీ శంకర్, ఎస్ఈ సుమిత్ర, అధికారులు పాల్గొన్నారు.