వనపర్తి టౌన్, వెలుగు: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించిన స్టేట్ లెవల్ ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ ఉమెన్స్ లీగ్ పోటీల్లో వనపర్తి జిల్లా స్టూడెంట్లు నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించారు. జిల్లా నుంచి గోజురియో కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అకాడమీకి చెందిన దాసరాజు అనన్య 37 కేజీ పాయింట్ ఫైవ్ విభాగంలో, సింగారపు ఝాన్సీ 42 కేజీ పాయింట్ ఫైవ్ విభాగంలో, కేతావత్ రేణుక 46 కేజీ హార్డ్ స్టైల్ విభాగంలో, దుప్పల్లి కీర్తన 55 కేజీ పాయింట్ ఫైవ్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించారు. విజేతలకు ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మి, ఖేలో ఇండియా కన్వీనర్ అనిత, ఒలంపిక్ అసోసియేషన్ సెక్రటరీ జగదీశ్యాదవ్ బహుమతులు అందించారు.
మహబూబ్ నగర్ టౌన్: మహబూబ్నగర్ ఆర్కే స్పోర్ట్స్ కరాటే మార్షల్ అకాడమీకి చెందిన స్టూడెంట్స్ మెడల్స్ సాధించినట్లు మాస్టర్ కె.రవికుమర్ తెలిపారు. 45 కేజీల విభాగంలో యామిని నాయుడు గోల్డ్, 50 కేజీల విభాగంలో కావ్య శ్రీ సిల్వర్, 47 కేజీల విభాగంలో వర్షిని సిల్వర్, మైనస్ 37 కేజీల విభాగంలో సారిక గోల్డ్, 37 కేజీల విభాగంలో నవ్య బ్రాంజ్, 40 కేజీల విభాగంలో సాయి సృజన బ్రాంజ్ మెడల్ సాధించారు.