
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "ది రాజా సాబ్" చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా తదితరులు నటిస్తున్నారు. ది రాజా సాబ్ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజా సాబ్ లో ముగ్గురు హీరోయిన్స్ తోపాటూ బాలీవుడ్ కి చెందిన మరో స్టార్ హీరోయిన్ ని కూడా తీసుకున్నారని టాక్. అయితే ఇప్పటికే మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ నటిస్తుండగా వీరితో ఒక్కో పాటలో ఒక్కొక్కరితో ప్రభాస్ స్టెప్పులేయనున్నాడని.. ఇక బాలీవుడ్ హీరోయిన్ తో కలసి స్పెషల్ స్పెషల్ చిందులేయనున్నట్లు సమాచారం.
హిందీలో బాగా పాపులర్ అయిన ఓ పాటని రీమిక్స్ చేసి తెలుగు, హిందీ ఆడియన్స్ ని టార్గెట్ చేసేందుకు తమన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే సాంగ్ రీమిక్స్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో స్పెషల్ సాంగ్ తో కలిపి ముగ్గురు హీరోయిన్స్ డ్యాన్స్ చేసి అలరించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. మరి ఇప్పుడు నలుగురు హీరోయిన్స్ అంటే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు..
ఈ విషయం ఇలా ఉండగా "ది రాజా సాబ్" ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఈ సినిమాకి సంబందించిన ఎడిటింగ్ వర్క్స్, పలు షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ కాలేదు. దీంతో అనుకున్న సమయానికి "ది రాజా సాబ్" రిలీజ్ కష్టమేనని తెలుస్తోంది. అయితే ఏప్రిల్ లో రిలీజ్ లేకుంటే నెక్ట్స్ దసరాకి ఉంటుందని సమాచారం.