షార్ట్​ సర్క్యూట్ తో నాలుగు గుడిసెలు దగ్ధం

షార్ట్​ సర్క్యూట్ తో నాలుగు గుడిసెలు దగ్ధం
  • ప్రమాదంలో పేలిన గ్యాస్ సిలిండర్ 
  • ఆరుగురికి గాయాలు .. 15 లక్షల ఆస్తి నష్టం

పెన్ పహాడ్, వెలుగు: మండలంలోని దోసపహాడ్ ఆవాస గ్రామంలోని జంగంపడిగ కాలనీలో బుధవారం షార్ట్​ సర్క్యూట్ జరిగి, నాలుగు గుడిసెలు కాలిపోయాయి. ఈ ఘటనలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆరుగురుకి గాయాలయ్యాయి. రూ.15లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఎస్సై గోపి కృష్ణ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడమంచి సాయమ్మ ఇంట్లో షార్ట్​ సర్య్కూట్​తో మంటలు చెలరేగి పక్క పక్కనే ఉన్న కడమంచి గంగమ్మ, పర్వతం లక్ష్మణ్, పర్వతం లక్ష్మమ్మ, గుడిసెలకు వ్యాపించాయి. 

అదే సమయంలో సాయమ్మ గుడిసెలో గ్యాస్ సిలిండర్ కు మంటలు తాకడంతో పేలింది. కాలనీకి చెందిన కడమంచినాగయ్య, సైదమ్మ, పర్వతం మంగమ్మ, సతీశ్​ పర్వతం, శ్రీను, పర్వతం భిక్షం, ఎలమంచమ్మకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. భాదితుల ఫిర్యాదు మేరకు ఎస్సై గోపి కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.