హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతోన్న ఏపీ కేడర్‌కు చెందిన 11 మంది ఐఏఎస్‌లను తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కొనసాగుతోన్న ఆమ్రపాలితో పాటు మరో 10 మంది ఐఏఎస్‌లకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సెంటర్ (డీఓపీటీ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో డీఓపీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నలుగురు ఐఏఎస్‌లు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, సృజన, వాణి ప్రసాద్ వేర్వేరుగా క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు.
ఏపీకి వెళ్లాలని డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి.. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్ క్యాట్‌కు విజ్ఞప్తి చేయగా.. ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన క్యాట్‌లో పిటిషన్ వేశారు. ఐఏఎస్‌ల పిటిషన్లపై 2024, అక్టోబర్ 15న క్యాట్ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. కాగా, ఏపీ కేడర్‌కు చెందిన 11 మంది ఐఏఎస్‌లు తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ALSO READ |చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలం: డిప్యూటీ సీఎం పవన్..
11 మంది ఐఏఎస్ ల రిక్వెస్ట్ ను సెంట్రల్ గవర్నమెంట్ తిరస్కరించింది. తిరిగి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. దీంతో క్యాట్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఐఏఎస్‌ల రిక్వెస్ట్‌కు సానుకూలంగా స్పందిస్తుందా లేదా తిరిగి ఏపీ వెళ్లాల్సిందేనని చెబుతుందా అని క్యాట్ నిర్ణయంపై సస్పెన్స్ నెలకొంది.