న్యూఢిల్లీ: గూగుల్ నుంచి నాలుగు ఇండియన్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ పొందాయి. ఆసియా పసిఫిక్ రీజియన్ నుంచి మరో 14 ఆర్గనైజేషన్లు ఈ ఛాన్స్ దక్కించుకున్నాయి. సస్టయినబిలిటీ సీడ్ ఫండ్ 2.0 కింద 5 మిలియన్ డాలర్ల గ్రాంట్‌ను గూగుల్.ఆర్గ్ కేటాయించింది. సామాజిక, పర్యావరణ సమస్యలను తీర్చేందుకు ఏఐ ఆధారిత పరిష్కారాలను ఏషియన్ వెంచర్ ఫిలాంత్రపీ నెట్‌వర్క్ (ఏవీపీఎన్) వెతుకుతోంది.
ఇండియా నుంచి ఐఆన్‌ఆర్‌ఈఎం ఫౌండేషన్, సీఈపీటీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (సీఆర్‌డీఎఫ్), ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్, గుజరాత్ మహిళా హౌసింగ్ సేవా ట్రస్ట్ (ఎంహెచ్‌టీ) గ్రాంట్ పొందాయి.