హౌరా మెయిల్ లో పేలుడు

హౌరా మెయిల్ లో పేలుడు

చండీగఢ్: హౌరా మెయిల్ జనరల్ కోచ్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

రైలు అమృత్ సర్ నుంచి హౌరాకు వెళ్తుంది. జనరల్ కోచ్ లో బాణసంచా ఉన్న ప్లాస్టిక్ బకెట్ పేలడంతో నలుగురు గాయపడ్డారు. వీరిన ఫతేగఢ్ సివిల్ ఆస్పత్రికి అధికారులు  తరలించారు. పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించారు.