హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మరో నలుగురు ఇంటర్ విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఫస్టియర్ స్టూడెంట్లకు ఇంగ్లిష్ ఎగ్జామ్ జరిగగా..కరీంనగర్ లో ముగ్గురు, నిజామాబాద్ లో ఒక స్టూడెంట్ డిబార్ అయ్యారు. వారిపై అధికారులు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు.
స్టేట్ ఆబ్జర్వర్లు ఆదిలాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, మేడ్చెల్ జిల్లాల్లోని పలు సెంటర్లను తనిఖీ చేశారు. ఇంగ్లిష్ ఎగ్జామ్ కు 5,00,936 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 4,80,542 మంది హాజరయ్యారు. మరో 20,394 (4.07%) మంది గైర్హాజరయ్యారు.