ఇంజినీరింగ్ స్టాఫ్  కాలేజ్ ఆఫ్ ఇండియాకు ఐఎస్ఓ సర్టిఫికెట్లు

హైదరాబాద్, వెలుగు : గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్  ఆఫ్  ఇండియాకు గ్రీన్ అవార్డుతో సహా నాలుగు ఐఎస్ఓ సర్టిఫికెట్లు దక్కాయి. శుక్రవారం క్యాంపస్ లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. హెచ్ వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్  లిమిటెడ్  ఎండీ శివరాం ఆలపాటి.. ఇంజనీరింగ్  కాలేజీ డైరెక్టర్  జి.రామేశ్వర్ రావుకు సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా శివరాం మాట్లాడుతూ కాలేజీలో పరిపాలన వ్యవహారాలు, డాక్యుమెంటేషన్ విధానాలు

ఉద్యోగులు తమ విధివిధానాలను పాటించడం, సమయపాలన తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని సర్టిఫికెట్లు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఆశించే అన్ని రకాల స్థాయిలను ఇంజినీరింగ్  స్టాఫ్  కాలేజ్  ఆఫ్ ఇండియా  పాటిస్తున్నందుకు ప్రత్యేకంగా గ్రీన్ అవార్డును కూడా ప్రదానం చేశామని ఆయన చెప్పారు. కాలేజీ సిబ్బంది, అధికారుల శ్రమ కారణంగా తమ కాలేజీకి సర్టిఫికెట్లు వచ్చాయని కాలేజీ డైరెక్టర్  జి.రామేశ్వర్  రావు తెలిపారు.