వరల్డ్ కప్ లో సొంతగడ్డపై భారత్ దూసుకెళ్తుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలిచి మంచి ఊపు మీద ఉంది. సెమీస్ చేరాలంటే మరో మూడు మ్యాచులు గెలిచినా సరిపోతుంది. అందరూ ఫామ్ లో నే ఉన్నారు. ఇక అంతా బాగుంది అనుకున్న సమయంలో వరుస గాయాలు టీమిండియాను ఆందోళనకు గురి చేస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నాలుగు గాయపడ్డారు. ఇంతకీ వారెవరో చూద్దాం.
వరల్డ్ కప్ లో భాగంగా నేడు భారత్ ( అక్టోబర్ 22) కీలకమైన న్యూజీలాండ్ తో పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలతో పాటు బ్యాటర్లు సూర్య కుమార్ యాదవ్, కిషన్ గాయపడ్డారు. బంగ్లాదేశ్ తో మ్యాచుకు హార్దిక్ గాయపడగా.. అదే మ్యాచులో అద్భుతమైన ఫీల్డింగ్ చేసిన జడ్డూకి మోకాలి గాయం తిరగబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read :- భారత్-న్యూజిలాండ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఇక యంగ్ ప్లేయర్లు సూర్య నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా.. కుడిచేతి మణికట్టుపై దెబ్బ తగలడంతో తర్వాత బ్యాటింగ్ చేయలేదు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తేనెటీగల ధాటికి ఊహించని విధంగా గాయపడ్డాడు. దీంతో నేడు కివీస్ తో జరిగే మ్యాచ్ కు వీరిలో ఎంత మంది అందుబాటులో ఉంటారో తెలియాల్సి ఉంది. హార్దిక్ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోగా.. మిగిలిన ముగ్గురిలో ఎంతమంది తుది జట్టులో స్థానం దక్కించుకుంటారో చూడాలి.