March OTT Crime Thrillers: మార్చిలో ఓటీటీలోకి వచ్చిన 4 క్రైమ్ థ్రిల్లర్స్..అస్సలు మిస్ అవ్వకండి

March OTT Crime Thrillers: మార్చిలో ఓటీటీలోకి వచ్చిన 4 క్రైమ్ థ్రిల్లర్స్..అస్సలు మిస్ అవ్వకండి

ఈ మధ్య ఓటీటీలలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు బాగా వస్తున్నాయి. ఆడియన్స్ కి కూడా నార్మల్ సినిమా చూసి చూసి బోర్ కొట్టేసినట్టుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి సినిమాలకే వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక థ్రిల్లర్ సినిమాలకు మలయాళ ఇండస్ట్రీ చాలా ఫేమస్. అక్కడ వారానికో థ్రిల్లర్ సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. వాటిని ఓటీటీలో డబ్ చేసి రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. అలా మార్చి నెలలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలేంటో లుక్కేద్దాం. 

అన్వేషిప్పిన్ కండేతుమ్:

మలయాళ సూపర్ స్టార్ టోవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్ లో థ్రిల్లింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్స్ లోకి వచ్చి మంచి విజయం సాధించింది. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు ఆడియన్స్ ఫుల్లుగా కనెక్ట్ అయ్యారు.మార్చి 8న ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.అంతేకాదు ప్రస్తుతం టాప్-10లో ట్రెండ్ అవుతోంది. చూడకపోతే వెంటనే చూసేయండి. 

మర్డర్ ముబారక్:

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ మర్డర్ ముబారక్ (Murder Mubarak). సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంది.  మార్చి 15 నుంచి హిందీ, తెలుగు, తమిళం భాషల్లో 'నెట్‍ఫ్లిక్స్' ఓటీటీలో అడుగుపెట్టింది. రాయల్ ఢిల్లీ క్లబ్ లో ఓ జిమ్ ట్రైనర్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఢిల్లీ నగరంలో స్టార్ సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలకు మాత్రమే అనుమతి ఉన్న ఈ క్లబ్ లో మర్డర్ జరగడం..అక్కడ జరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. 

భూతద్దం భాస్కర్ నారాయణ:

యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా నటించిన ఈ సినిమాను పురుషోత్తం రాజ్ తెరకెక్కించగా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైకో కిల్ల‌ర్ బ్యాక్‌ డ్రాప్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. దీంతో ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా మార్చ్ 22 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. వరుస హత్య కేసుల మిస్టరీని ఛేదించడం కోసం హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఆకట్టుకుంటోంది. 

అబ్ర‌హం ఓజ్ల‌ర్:

ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ జనవరి 11న థియేటర్లలో రిలీజయింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ థియేటర్ ఆడియాన్స్ కు బాగా నచ్చేసింది. ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో  స్ట్రీమింగ్ అవుతోంది. మెడిక‌ల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ కథాంశంతో తెర‌కెక్కిన అబ్ర‌హం ఓజ్ల‌ర్ లో సీనియర్ యాక్టర్ జ‌య‌రాం(Jayaram) హీరోగా న‌టించాడు.ఈ సినిమాలో అబ్ర‌హం ఓజ్ల‌ర్ అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా హీరో జ‌య‌రాం నటనకు ప్ర‌శంస‌లు అందుకున్నారు.మార్చి 20 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్ లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍ అవుతుంది.  

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ను ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమాలు మంచి కిక్ ఇస్తాయి.మిస్ అవ్వకుండా చూసేయండి.

ALSO READ :- This Week OTT Movies: ఈవారం OTT కంటెంట్.. లిస్టులో సూపర్ హిట్ సినిమాలు

 

 

 

 

  • Beta
Beta feature