లొంగిపోయిన నలుగురు మావోయిస్టులు

లొంగిపోయిన నలుగురు మావోయిస్టులు
  • దండకారణ్య మిలిటరీ చీఫ్‌‌‌‌ దేవా సోదరుడితో పాటు మరో ముగ్గురు...

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో దండకారణ్య మిలిటరీ చీఫ్‌‌‌‌ బార్సే దేవా సోదరుడు బార్సే సన్నాతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. వీరిలో ఇద్దరిపై రూ. 8 లక్షల చొప్పున రివార్డు ఉందని సుక్మా ఎస్పీ కిరణ్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ వెల్లడించారు. సుక్మా జిల్లా పువ్వర్తిలో ఇటీవల పోలీస్‌‌‌‌ బేర్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ ఏర్పాటు చేయడంతో మావోయిస్టులపై ఒత్తిడి పెరిగిందని, ఇందులో భాగంగానే పలువురు లొంగిపోతున్నారని బర్తర్‌‌‌‌ ఐజీ సుందర్‌‌‌‌రాజ్‌‌‌‌ తెలిపారు.