T20 World Cup 2024: ఫ్లోరిడాలో భారీ వర్ష సూచన.. నాలుగు మ్యాచ్‌లకు పొంచి ఉన్న ముప్పు

T20 World Cup 2024: ఫ్లోరిడాలో భారీ వర్ష సూచన.. నాలుగు మ్యాచ్‌లకు పొంచి ఉన్న ముప్పు

వరల్డ్ కప్ లో భాగంగా లీగ్ మ్యాచ్ లు సగం ముగిశాయి. మరోవారం రోజుల్లో గ్రూప్ మ్యాచ్ లన్నీ ముగుస్తాయి. కొన్ని జట్లు సూపర్ 8 కు అర్హత సాధించగా.. మరికొన్ని జట్లు ఈ రౌండ్ కు చేరువలో ఉన్నాయి. ఇంకొన్ని జట్లు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నాయి. వరల్డ్ కప్ USAలో మూడు నగరాల్లో జరుగుతుంది. న్యూయార్క్, డల్లాస్ తో పాటు ఫ్లోరిడాలోని లాడర్‌హిల్ లో మ్యాచ్ లు జరగాల్సి ఉంది.  ఇంతవరకు బాగానే ఉన్నా వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్ లకు వర్షం ముప్పు పొంచి ఉంది.

అమెరికాలోని ఫ్లోరిడాలో జరగబోయే మ్యాచ్ లు వర్షం కారణంగా జరగడం అనుమానంగా మారింది. వాతావరణ సూచన ప్రకారం.. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో రానున్న పది రోజుల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం 95% ఉంది. మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాల్లో తర్వాతి రోజుల్లో వరుసగా 70%, 81%, 87%, 72% ,42% వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ జరగబోయే మ్యాచ్ లు రద్దయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే కొన్ని జట్ల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు.    
 
T20 ప్రపంచ కప్ 2024లో ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో మ్యాచ్ లు 

జూన్ 12 : నేపాల్ vs శ్రీలంక 

జూన్ 14: అమెరికా vs ఐర్లాండ్

జూన్ 15: భారత్ vs కెనడా: 

జూన్ 16: పాకిస్తాన్ vs ఐర్లాండ్