హత్య కేసులో నలుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

మిర్యాలగూడ, వెలుగు : యువకుడిని హత్య చేసిన కేసులో ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు గురువారం మీడియాకు వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన వస్కుల జనార్దన్‌‌‌‌‌‌‌‌ (34) ఈ నెల 7న రాత్రి గ్రామంలోని ఉమేశ్‌‌‌‌‌‌‌‌ కిరాణా షాపు వద్దకు వెళ్లాడు. ఓ వివాదంలో సతీశ్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తికి జనార్దన్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడని అదే గ్రామానికి చెందిన కుంచం విక్రమ్‌‌‌‌‌‌‌‌ జనార్దన్‌‌‌‌‌‌‌‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో షాప్‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చిన జనార్దన్‌‌‌‌‌‌‌‌తో విక్రమ్‌‌‌‌‌‌‌‌ గొడవ పడ్డాడు.

అలాగే తన తల్లిదండ్రులు కుంచం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, ఎల్లమ్మ, సోదరుడు అజిత్‌‌‌‌‌‌‌‌ను పిలిచి అంతా కలిసి జనార్దన్‌‌‌‌‌‌‌‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ జనార్ధన్‌‌‌‌‌‌‌‌ నల్గొండ జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ 9న చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విక్రమ్‌‌‌‌‌‌‌‌, అతడి తల్లిదండ్రులు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, ఎల్లమ్మ, సోదరుడు అజిత్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు.