పట్టపగలే బీభత్సం.. అందరూ చూస్తుండగానే పొడిచారు

సూర్యాపేట జిల్లాలో  కత్తి పోట్లు కలకలం రేపాయి. పట్టపగలే నలుగురు యువకుల బీభత్సం సృష్టించారు. వందలాంది మంది చూస్తు్ండగానే నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతేకాకుండా తమ వెంట తెచ్చుకున్న కత్తులతోనూ దాడి చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.  

సంతోష్ అనే వ్యక్తికి బంటితో పాటుగా మరో ముగ్గురు వ్యక్తులు దాడికి దిగారు.  అయితే  దీనికి పాత గొడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.  సంతోష్, బంటి గతంలో ప్రాణస్నేహిలతులేనని, కానీ గత కొంతకాలంగా పలు అంశాలకు సంబంధించి ఇద్దరి మధ్య వివాదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.  

ఆ కోపంతోనే బంటి సంతోష్  పై దాడి చేసినట్లు సమాచారం.  బంటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గాయపడిన సంతోష్ ను  ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సంతోష్  కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.  గతంలో సంతోష్ గంజాయి కేసులో ఆరెస్ట్ అయ్యాడు.