
హైదరాబాద్ లోని కూకట్పల్లికి చెందిన నలుగురు యువకులు విహారయాత్రకు అని వెళ్లి బాపట్ల నాగరాజు కాలువలో శవమై తేలారు. ఉదయం సూర్యలంక సముద్ర తీరానికి హైదరాబాద్ నుండి రాగా.. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న నాగరాజు కాలవలోకి ఆరుగురు వ్యక్తులు దిగగా అందులో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈత కోసం కాలువలోకి దిగి కొట్టుకపోయినట్టు సమాచారం. వీరిలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీయగామరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కాలువలో కొట్టుకుపోయిన వారిని సన్నీ,సునీల్, కిరణ్,నందులుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పడవ సహాయంతో నాగరాజు కాలవ వెంబడి గాలిస్తున్నారు.
also read : లోయలో పడ్డ బస్సు.. 27 మంది మృతి.. ఎక్కడంటే...