
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. హబ్సిగూడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్యా భర్తలు ఇద్దరితో పాటు పిల్లలు కూడా చనిపోవడం తీవ్ర విషాదం మిగిల్చింది.
హస్బీగూడలోని స్ట్రీట్ నెం.8 లో ముందుగా ఇద్దరు పిల్లలను చంపి తర్వాత భార్యా భర్తలు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు.. చనిపోయిన వారు చంద్రశేఖర్ రెడ్డి (41), కవిత (35), పిల్లలు శ్రీత (13), విశ్వంత్ (10) గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే కారణం కావచ్చునని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.