మహేశ్వరం: ఇటుక బట్టీలో పనిచేసే ఒరిస్సాకు చెందిన మహిళ పై అదే రాష్ట్రానికి చెందిన నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగింది. మహేశ్వరం మండలం ఎన్.డి తాండ గ్రామానికి పక్కన ఇటుక బట్టి కర్కాణ లొ పనిచేస్తున్న ఆ మహిళను.. శుక్రవారం రాత్రి బట్టిలో పనిచేసే రాహుల్, మనోజ్, దుర్గ, దయ అనే నలుగురు యువకులు కలిసి అత్యాచారం చేసి పరారయ్యారు. నిందితులంతా తేథిల్ కుట్టి గ్రామం, తుర్కెల మండలం, బలంగిర్ జిల్లా, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారు. మాహేశ్వరం పోలీస్ స్టేషన్ లో వారిపై కేసు నమోదైంది. పరారీలో ఉన్న నిందితుల కోసం మహేశ్వరం పొలీసులు గాలిస్తున్నారు.