ఏపీలో ఘోరం : ఉచిత ఇసుక కోసం వాగులో దిగి కొట్టుకుపోయిన నలుగురు కుర్రోళ్లు

ఏపీలో ఘోరం : ఉచిత ఇసుక కోసం వాగులో దిగి కొట్టుకుపోయిన నలుగురు కుర్రోళ్లు

ఏపీలో కూటమి అధికారంలోకి రావటానికి కారణమైన కీలక హామీల్లో ఉచిత ఇసుక పథకం కూడా ఒకటని చెప్పచ్చు.. అయితే, అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక పథకం అమలు కూటమి ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వం వసూలు చేస్తున్న ట్రాన్స్పోర్ట్ చార్జీలు, హ్యాండ్లింగ్ చార్జీలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా జరిగిన సంఘటన కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ఉంది.. ఏపీలోని అల్లూరి జిల్లాలో దారుణం జరిగింది.. జిల్లాలోని తిమ్మాపురంలో ఉచిత ఇసుక కోసం వాగులోకి దిగి నలుగురు యువకులు గల్లంతయ్యారు.

శుక్రవారం ( నవంబర్ 8, 2024 ) చోటు చేసుకుంది ఈ ఘటన. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏలేశ్వరం మండలంలోని తూర్పు లక్ష్మీపురానికి చెందిన నలుగురు యువకులు ఉచిత ఇసుక కోసం తిమ్మాపురంలోని వాగులో దిగి గల్లంతయ్యారు. 

స్థానికుల ఫిర్యాదుతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.గాలింపు క్లిష్టంగా మారటంతో ఎండీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు పోలీసులు.