
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని శాసన మండలిలో సోమవారం ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల మధ్య నలుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాంగ్రెస్ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి ఎన్నికైన నెల్లికంటి సత్యం ప్రమాణం చేయనున్న నేతల్లో ఉన్నారు. సోమవారం కాకుండా మరో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రమాణం చేయనున్నారు.