డెంగీ జ్వరంతో నాలుగు నెలల గర్భిణి మృతి

 డెంగీ జ్వరంతో నాలుగు నెలల గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ములుగు జిల్లా మంగపేట మండలం బోరునర్సాపూర్​ గ్రామానికి చెందిన జక్కం రమ్య, శ్రీనివాస్​కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె పావని (23) ని రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు జిల్లా కుక్కునూరు గ్రామానికి చెందిన విజయ్​కి ఇచ్చి పెళ్లి చేశారు. 

ప్రస్తుతం పావని నాలుగు నెలల గర్భిణి. మూడు రోజుల పాటు ఆమెకు జ్వరంగా ఉండడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో టెస్టులు చేయించగా డెంగీ అని తేలింది. వెంటనే బాధితురాలిని సోమవారం హైదరాబాద్​కు తరలించి ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయింది. పావని మృతితో అటు అత్తవారి ఊరు కుక్కునూరు, ఇటు తెలంగాణలోని మంగపేట బోరునర్సాపూర్ లో విషాదం నెలకొంది.