ఆసియా బాక్సింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి మరో నలుగురు బాక్సర్లు

 ఆసియా బాక్సింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి మరో నలుగురు బాక్సర్లు

అమన్‌‌‌‌‌‌‌‌ (జోర్డాన్‌‌‌‌‌‌‌‌): ఆసియా అండర్‌‌‌‌‌‌‌‌–15, 17 చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో మరో నలుగురు బాక్సర్లు సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌–17 క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో అమన్‌‌‌‌‌‌‌‌ సివాచ్‌‌‌‌‌‌‌‌ (63 కేజీ), దేవాన్షు (80 కేజీ) ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ (రిఫరీ స్టాప్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ కంటెస్ట్‌‌‌‌‌‌‌‌) బద్వారా వరుసగా జియాడ్రాచ్ జేమ్స్ కాబ్రెరా (ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌)పై, అబ్దుల్లా అల్దబ్బాస్ (జోర్డాన్‌‌‌‌‌‌‌‌)పై  గెలిచారు. అమ్మాయిల కేటగిరీలో సిమ్రన్‌‌‌‌‌‌‌‌జిత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ (60 కేజీ) 5–0తో ఆయ అల్హాసనాత్ (జోర్డాన్‌‌‌‌‌‌‌‌)పై గెలవగా, హిమాన్షి (70 కేజీ) ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ ద్వారా ఫరా అబౌ లైలా (పాలస్తీనా)ను ఓడించి సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించింది.

 ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఈ టోర్నీలో ఇండియాకు కనీసం 45 మెడల్స్‌‌‌‌‌‌‌‌ ఖాయమయ్యాయి. ఇందులో అండర్‌‌‌‌‌‌‌‌-–15లో 25, అండర్‌‌‌‌‌‌‌‌–-17లో 18 ఉన్నాయి. సెమీస్‌‌‌‌‌‌‌‌ చేరిన ప్రతి బాక్సర్‌‌‌‌‌‌‌‌కు మెడల్‌‌‌‌‌‌‌‌ ఇస్తారు. అండర్‌‌‌‌‌‌‌‌–17 క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సాహిల్‌‌‌‌‌‌‌‌ డుహన్‌‌‌‌‌‌‌‌ (60 కేజీ) 2–3తో అమిరాలి మెహ్రాబీ (ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌) చేతిలో, అనంత్‌‌‌‌‌‌‌‌ గౌరీశంకర్‌‌‌‌‌‌‌‌ దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ (66 కేజీ) 0–5తో డానియల్ షల్కర్‌‌‌‌‌‌‌‌బే (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో, ప్రియాన్షు షెరావత్‌‌‌‌‌‌‌‌ (75 కేజీ) 0–5తో ఖుర్షిద్‌‌‌‌‌‌‌‌బెక్ జురావ్ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో, లోవెన్‌‌‌‌‌‌‌‌ గులియా (80+ కేజీ) 0–5తో ఫర్హౌద్ ఘోర్బాని (ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడారు.